విభిన్నమైన కథా, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లోకి రాబోతోంది. ఈక్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట ముఖ్య అతిథిగా విచ్చే
సి ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ “మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ బాగుంది. ట్రైలర్ ఎంత బాగుందో.. సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ మటన్ సూప్‌ను ఎంతో ఇష్టపడి తీశామని తెలిపారు. నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ రామచంద్ర ఈ సినిమాను ఎంతో గొప్పగా చిత్రీకరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో రమణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నిర్మాత రామకృష్ణ సనపల, జెమినీ సురేష్, శ్రీ చరణ్, వెంకీ వీణా, కిరణ్ మేడసాని, గోవింద్ పాల్గొన్నారు.