మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వున్నప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ తెలుసు కదాలో ఒక యూనిక్ పాయింట్ ని టచ్ చేశాం. సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు. నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడం ఇష్టం. తెలుసు కదాలో మంచి లైట్ హార్ట్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంది. సినిమాలో లవ్, ఎమోషన్, హాస్యం, పాటలు, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు. -నీరజ చాలా పాషన్‌తో సినిమా చేశారు. ఆమె విజన్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇది మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ఇందులో మూడు క్యారెక్టర్స్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సిద్దు క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. రాగ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. సిద్దుకి అన్ని విభాగాలలో చాలా నాలెడ్జ్ వుంటుంది. ఒక యాక్టర్‌కి అన్ని విభాగాలపై పట్టు వుండటం అదృష్టం. తన టైమింగ్ అద్భుతం. -రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. తమన్ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నేను నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ చేయడం ఆనందంగా వుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. బీజీఎం చాలా అద్భుతంగా వుంటుంది. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.