ఎస్‌ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి వర్ణమాల సాంగ్ ని లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో దుశ్యంత్ మాట్లాడుతూ “హిస్టరీ, మైథాలజీ, సనాతన ధర్మ ఎలిమెంట్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన స్క్రిప్ట్ ఇది. తెలుగు, కన్నడ రెండిట్లోనూ షూట్ చేశాము. ఆశిక రంగనాథన్ అద్భుతంగా నటించారు”అని తెలిపారు. హీరోయిన్ అశిక మాట్లాడుతూ “ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి”అని పేర్కొన్నారు. డైరెక్టర్ సునీ మాట్లాడుతూ “ఇది ఫాంటసీ మైథిలాజికల్ మూవీ. అందరూ థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దీపక్, అనురాగ్ కులకర్ణి, శాండీ, విలియం పాల్గొన్నారు.