మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలి విడత ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 11 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలి విడతలో 292 జడ్‌పిటిసిలు, 2964 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఎంపిటిసి, జెడ్‌పిటిసి, ఎన్నికల తొలివిడత నామినేషన్లు
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- :అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- :అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు- : నవంబర్ 11 ఉదయం 8 గంటలకు ప్రారంభం
మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి రెండు దశల్లో ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతారు. నవంబర్ 11న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఓట్ల లెక్కింపు జరుగనుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపిటిసి, 565 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల రెండో విడత నామినేషన్లు:
రెండో విడత నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
పరిశీలన: అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ :- అక్టోబర్ 19
ఎన్నికల తేదీ- : అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు- : నవంబర్ 11 ఉదయం 8 గంటలకు ప్రారంభం