మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు పెంపుపై ఇంకా సందిగ్ధత తొలగిపోలేదు. ఈ అంశంపై హైకోర్టు లో బుధవారం సుదీర్ఘంగా విచారణ కొనసాగిం ది. అనంతరం ఈ విచారణ మరుసటి రోజు గురువారం మధ్యాహ్నానానికి హైకోర్టు వాయిదా వేసిం ది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుండటంతో దానిని అయి నా ఆపాలని బీసీలకు రిజర్వేషన్లు పెంచడాన్ని వ్య తిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిని పిటిషన్‌దారులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. రా ష్ట్రంలో సంచలనంగా మారిన ఈ అంశం పై హై కోర్టులో కొనసాగుతున్న విచారణ పై ఉత్కంఠ వీడలేదు. ఈ కేసు వివరాలలోకి వెళితే బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 9 ను సవాల్ చేస్తూ మాదవ్ రెడ్డి, రమేష్ అనే వ్యక్తు లు దాఖలు చేసిన పిటిషన్ల పై బుధవారం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కు మార్ సింగ్, మెహియుద్దీన్‌లతో కూడిన ధర్మాస నం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బిసి రిజర్వేషన్ల ను సమర్ధిస్తూ కొన్ని,
వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే. బీసీ సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై విచారణ ప్రారంభమైంది. దీనిపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఏజి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా, ఆ పిటిషన్ల ప్రస్తుత పరిస్థితి ఏమిటని సిజె ప్రశ్నించారు. సుప్రీం ధర్మాసనం కొట్టివేసిందని ఏజి కోర్టుకు వివరించారు. రిజర్వేషన్ల పెంపును సమర్తిస్తూ, వ్యతిరేకిస్తూ ఇరువైపులా వాదనలు జరిగిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చుతూ, తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
పిటిషనర్ తరపు వాదనలు
రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనర్ తరపున న్యాయవాదులు మయూర్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం రాజ్యాంగానికి, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్దంగా 50 శాతం వర్టికల్ రిజర్వేషన్ల పరిమితిని మించి బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ నెంబర్ 9, మున్సిపల్ ఎన్నికల కోసం జీఓ నెంబర్ 41 జారీ చేసిందని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దమని ఈ రెండు జీఓలను కొట్టివేయాలని కోరారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా అది 50 శాతం పరిమితికి మించరాదన్నారు. ఎజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం ఎటువంటి శాస్త్ర, సాంకేతిక, వివరాలు లేకుండా బిసిలకు రిజర్వేషన్లు పెంచిదన్నారు.
ఎస్సీ, ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకోకుండా బిసిలకు 2018 లో ఇచ్చిన 34 శాతం జీఓను హైకోర్టు కొట్టివేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక శాసనాలు పాటించకుండా 67 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసిందన్నారు. శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులు ఇంకా గవర్నర్ వద్దనే పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగ బద్దమైన ఎన్నికలకు వ్యతిరేకం కాదని, రాజ్యాంగం విరుద్దంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పిటిషనర్ల తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 51.92 శాతంగా ఇస్తే కోర్టు కొట్టివేసిందని, తెలంగాణలో 67 శాతానికి చేరుకున్నాయని కోర్టు తెలిపారు. ఓబిసి రిజర్వేన్లు ఏ ప్రాతిపదికన ఇచ్చినా ఎంత కల్పించినా 50 శాతం పరిమితి నిబంధన తప్పనిసరిగా పాటించాలని సుప్రీం తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధానంగా ట్రిపుల్ టెస్ట్‌ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయలేవని, ఆర్టికల్ 285ఏ, ఎన్నికల నోటిషికేషన్‌లను సవాల్ చేస్తున్నట్లు పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం తరపున వాదనలు ఇలా&
ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరు కాగా, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనూ సింఘ్వీ వర్చువల్‌గా వాదనలు వినిపించారు. బిసిల రిజర్వేషన్ల కోసం చట్టసభల్లో ప్రవేశపెట్టిన బిల్లును అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవంగా ఆమెదించాయని తెలిపారు. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదని, జీవోకు మూలమైన చట్టాన్ని ఛాలెంజ్ చేయకుండా జీఓలను ఛాలెంజ్ చేయడం కుదరదన్నారు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూదని కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలు మాత్రమే ఉన్నాయని, రాజ్యాంగంలో ఎలాంటి పరిమితి లేదన్నారు. ఇడబ్లూఎస్ కోటా కింద 2019లో 10శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు రిజర్వేషన్ల పరిమితి 60 శాతానికి చేరిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సర్వే నిర్వహించి, రిజర్వేషన్ల పెంపు చేపట్టిందన్నారు. బిసిలకు సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు.రిజర్వేషన్లను పెంచుకునే వెలసులుబాటు ఉందని, రాజ్యాంగంలో 50 శాతం పరిమితి లేదని, సుప్రీం కోర్టు తీర్పులు మాత్రమే ఉన్నాయని, చట్టాన్ని తప్పుగా అర్దం చేసుకుంటున్నారని, ఓకే ఒరలో రెండు కత్తులు అనే విధంగా వ్యవహరిస్తున్నారని సింఘ్వీ వాదించారు. ప్రభుత్వం 42 శాతం బిల్లును గవర్నర్‌కు పంపిందని, గవర్నర్ ఆమోదించలేదని, అలాగని తిరిగి పంపిచలేదన్నారు.
గవర్నర్‌లు నెలల తరబడి బిల్లులు దగ్గర ఉంచుకోవడంతో రాజ్యాంగ ప్రతిష్టంభన నెలకొంటుందని సింఘ్వీ వివరించారు. కొంతమంది గవర్నర్లు బిల్లులను త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని, ఏళ్ల తరబడి ఆమోదించకుండా, తిప్పి పంపకుండా చేస్తున్నారని, తమిళనాడులో గవర్నర్ వద్ద ఒక బిల్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారని, వారు నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యవస్థ స్థంభించిపోతోందని, బిసి రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఇలాగే వ్యవహరించారని చెప్పారు. ఈ దశలో గరవ్నర్ దగ్గర ఉన్న బిల్లును ఆమోదించకపోవడంతో తమిళనాడు తరహాలో చట్టంగా బావిస్తున్నారా అని సిజే ప్రశ్నించగా, సింఘ్వీ లేదని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవద్దని తీర్పులు ఉన్నాయని, ఎన్నికల నోటిఫికేషన్‌ను కోర్టుకు అందచేశారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం సరికాదని తెలిపారు. పూర్తి వాదనలు విన్న తరువాతనే జీఓ నెంబర్ 9 పై నిర్ణయం తీసుకోవాలని, కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
ట్రిపుల్ టెస్ట్
ట్రిపుల్ టెస్ట్ అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట, బిసి రిజర్వేషన్ల పిటిషన్ల విచారణ సందర్భంగా పదే పదే ఈ పదం న్యాయవాదులు ఉపయోగించారు. ట్రిపుల్ టెస్ట్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్ల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీంకోర్టు విధించిన మూడు షరతులే ఈ ట్రిపుల్ టెస్ట్‌గా పేర్కొన్నారు. కమిషన్ సిఫారస్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల వారీగా ఎంత శాతం రిజర్వేషన్లు అవసరమో నిర్దారించాలి. ఈ నిష్పత్తి విస్తృతమైన, అనవసరమైన రిజర్వేషన్లకు దారితీయకుండా చూడాలి. మొత్తం గా రిజర్వేషన్ల శాతం (ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు కలిపి) 50శాతం మించుకుండా చూసుకోవాలి. ఓబిసిలకు రిజర్వేషన్లు కేటియించినప్పటికీ, అది మొత్తం రిజర్వేషన్ల సీలింగ్ దాటకుండా ఉండాలిలని పేర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించే విషయంలో ట్రిపుల్ టెస్ట్‌ను పాటించకపోవడంతో న్యాయసమస్యలు వస్తున్నాయని కోర్టులు ఈ విధానం అనుసరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు.
అడ్వకేట్ జనరల్‌తో బిసి మంత్రుల భేటీ
అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో బుధవారం సాయంత్రం బిసి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు సమావేశమయ్యారు. తుది విచారణ ఉన్న నేపథ్యంలో గురువారం హైకోర్టులో వినిపించే వాదనలపై అడిగి తెలుసుకున్నారు. కోర్టు తీర్పు కచ్చితంగా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వస్తుందన్న ఆశాభావం మంత్రులు వ్యక్తం చేసారు. బీసీల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని, ప్రతివాద పిటిషనర్ల లాయర్లకు ధీటుగా వాదనలు వినిపించారని ఏజిని వారు అభినందించారు.