వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ’ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ “డ్యూడ్ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది. డ్యూడ్ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.