టమాటా లోడ్‌తో వెళ్తున్న బోలెరాను కంది మండలంలో వెనుక నుంచి వస్తున్న డిసిఎం గురువారం ఢీ కొట్టింది. వివరాలిలా ఉన్నాయి. బోలెరా వాహనం టమాటాలను తీసుకుని శంకర్‌పల్లి నుంచి నారాయణఖేడ్‌కు బయలు దేరింది. కంది ఆర్‌టిఎ ఆఫీస్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చి డిసిఎం ఢీకొట్టింది. ఫలితంగా బోలెరా వాహనం దెబ్బతిన్నది. జనం టమాటాను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. డ్రైవర్ మనోజ్‌కు గాయాలయ్యాయి.ఇంద్రకరణ్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.