అమరావతి: పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల మత్యసంపద దెబ్బతింటుందని అన్నారు. ఉప్పాడ మత్స్యకారుల బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పాడ మత్స కారుల సమస్యలపై చర్చించామని తెలియజేశారు. ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు దశల్లో పరిశీలిస్తాని చెప్పారు. మత్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తానని, చేపల వేటను కొనసాగిస్తూ ఉప్పాడలో 7,193 మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడ్డాయని పేర్కొన్నారు.
పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు ధశల్లో పరిశీలిస్తానని, రూ. 323 కోట్లతో సి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉందని, ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈ నెల 14న సమావేశం ఉందని, ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని మాట ఇస్తున్నానని పవన్ కల్యాణ్ హామి ఇచ్చారు. ఉప్పాడ- కొణపాక మధ్యతీర రక్షక పనులు ప్రారంభించామని, పరిశ్రమలకు వ్యతిరేకం కాదని మత్స్యకారులు చెబుతున్నారని అన్నారు. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 323