హైదరాబాద్: ఇవాళ్టి నుంచి లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండడంతో టిపిసిసి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.
ఇవాళ, రేపు జడ్‌పిటిసి అభ్యర్థులను ఖరారు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని టిపిసిపి ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపునకు కృషి చేయాలన్నారు. శాస్త్రీయంగానే బిసి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని, హైకోర్టులో బిసి రిజర్వేషన్ల కేసు గెలుస్తామని, అడ్వకేట్లు ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించారని తెలియజేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపు 90 శాతం సీట్లను గెలుచుకుంటామని, బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకెళ్తోందన్నారు.