మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్, పాక్ జట్టుకు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 221 పరుగుల మోస్తరు స్కోరు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ (109) సెంచరీతో మెరవగా.. అలానా కింగ్ (51 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించింది. మిగతా వారందరూ ఘోరంగా విఫలమవ్వడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక, పాకిస్థాన్ బౌలర్లలో నష్రా సంధు మూడు వికెట్లు పడగొట్టగా.. ఫాతిమ సనా, రమీమ్ చెరో రెండు వికెట్లు.. డయానా, సాదియ ఇక్బాల్ లు ఒక్కో వికెట్ తీశారు.