నగరంలో కంట్రీమేడ్ పిస్టల్ వ్యాపారం గుట్టు రట్టయింది. ఫలక్‌నుమా పోలీసుల సమన్వయంతో ప్రత్యేక జోనల్ క్రైమ్ బృందం దేశీయంగా తయారు చేసిన పిస్టల్‌ను అక్రమంగా కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నిందితులను చందానగర్‌కు చెందిన 25 ఏళ్ల విజయ్ యాదవ్, సంతోష్ నగర్‌కు చెందిన 22 ఏళ్ల బంటీ కుమార్ యాదవ్‌గా గుర్తించారు. ఇద్దరూ జార్ఖండ్‌కు చెందినవారు. ఫలక్‌నుమా, చంద్రాయణగుట్టలోని స్థానిక వైన్ షాపుల సమీపంలో పండ్ల విక్రేతలుగా పనిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల క్రితం విజయ్ యాదవ్ బీహార్ నివాసి సోను కుమార్ నుండి
రూ. 58,000 కు 0.7 ఎంఎం దేశీయంగా తయారు చేసిన పిస్టల్‌ను కొనుగోలు చేశాడు. అతను ఆయుధాన్ని ఎక్కువ ధరకు విక్రయించాలని భావించి అవసరమైన కొనుగోలుదారులను సంప్రదించాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచా రం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 0.7 ఎంఎం పిస్టల్‌తో పాటు రెండు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోను కుమార్ పరారీలో ఉన్నాడు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.