అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టిడిపి నేతలు రెచ్చిపోయారు. టిడిపి స్థానిక నేతలు గొడ్ల శ్రీను, గొడ్ల సైది ఓ కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టిడిపి నేతలు తనపై, తన అన్నపై దౌర్జన్యంగా దాడి చేశారని ఓ యువతి ఆరోపణలు చేసింది. తన అన్న, నాన్నను కొడుతుండగా తాను అడ్డుకోబోయానని, తనపై కూడా కత్తితో దాడి చేశారని ఆరోపణలు చేసింది. గొడ్ల సైది తనపై కత్తితో దాడి చేయడంతో మెడకు రెండు చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని యువతి పేర్కొంది. తమకు న్యాయం చేయాలని బాధిత యువతి, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
