మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవ డం అత్యంత బాధాకరమని, ఈ బలవన్మరణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బా ధ్యత అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్ స ర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ సంక్షోభం, ఎ న్నికల హామీల వైఫల్యం కారణంగానే అన్నదాతలు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఒక ప్రకటనలో ఆరోపించా రు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కెటిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణం చేసుకున్న వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వే ములవాడ మండలం, అచ్చన్నపేటకు చెందిన మొగిలి లక్ష్మణ్ (45),
మహబూబాబాద్ జి ల్లా, కేసముద్రం మండలం, నారాయణపురం పీక్లా తండాకు చెందిన గూగులోత్ భాస్కర్ (40), హన్మకొండ జిల్లా, శాయంపేట మం డల కేంద్రానికి చెందిన నాలికి అనిల్ (29) ఉ న్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతతో తెచ్చిన సాగునీటి సంక్షోభం, పెట్టుబడి సాయం లేకపోవడం, పంట నష్టానికి పరిహారం అందకపోవడం వంటి కారణా ల వల్లే ఈ అన్నదాతలు తమ నిండు ప్రాణా లు తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ ముగ్గురు రైతుల బలవన్మరణాలకు గల కారణాలను విశ్లేషిస్తూ కెటిఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చేతకానితనంతో సృష్టించిన సాగునీటి సంక్షోభంతో బోర్లు వేసి,
తీవ్రంగా నష్టపోయిన మొగిలి లక్ష్మణ్ ప్రాణాలు తీసుకుంటే… రైతుబంధు వంటి పెట్టుబడి సాయం లేక, ఆర్థిక భారంతో అప్పుల పాలై గూగులోత్ భాస్కర్ బలయ్యారని పేర్కొన్నారు. అలాగే, భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందక నాలికి అనిల్ అనే యువ రైతు కుటుంబాన్ని విషాదంలో ముంచి తనువు చాలించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రేవంత్ సర్కార్ తెచ్చిన ఈ వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కలేక అన్నదాతలు వరుసగా తమ నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు
తిరిగి మొదలైన మరణ మృదంగం
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతుల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయని ఇటీవలే ఎన్‌సిఆర్‌బి నివేదిక తేల్చిచెప్పిన విషయాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మళ్ళీ కాంగ్రెస్ పాలన రాగానే రైతు కుటుంబాల్లో ఈ మరణమృదంగం ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన స్థాయిలో మరోసారి తెలంగాణ గడ్డపై రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం విషాదమే కాదు, ముంచుకొస్తున్న విలయానికి సంకేతం అని వ్యాఖ్యానించారు.
సంఘటితంగా పోరాడదాం: రైతులకు కెటిఆర్ పిలుపు
రైతన్నలారా అధైర్యపడకండి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ సారథ్యంలో మళ్లీ వ్యవసాయాన్ని గాడిన పెట్టుకుందాం అంటూ కెటిఆర్ రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. అప్పటి వరకు సంఘటితంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.