రాష్ట్రంలో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్- టీఆర్ కఫ్ సిరప్‌లను విక్రయించొద్దంటూ అందులో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసిఎ) పేర్కొంది. మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లోని భోపాల్‌లోని లేబరేటరీల నుంచి ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు తమ సమాచారం లభించినట్లు డిసిఎ డైరెక్టర్ జనరల్ షహనాజ్ ఖాసీం పేర్కొన్నారు. ప్రజలు వెంటనే ఈ రెండు దగ్గు మందులు వాడకాన్ని నిలిపివేయాలని సూచించారు. ఎక్కడైనా ఈ రెండు దగ్గు మందులు విక్రయిస్తే వెంటనే డిసిఎ టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 6969కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని కోరారు.