పిడుగుపడి విద్యార్థి మృతి చెందిన ఘటన యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది.వివరాల్లోకి వెళితే.. నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు మనీష్ 12 గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. రోజువారిగానే పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చాక ఇంటి ప్రక్కన ఆరుబయట ఆడుకొంటుండగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన పిగుపడి స్ప్రహకోల్పోయి కిందపడిపోయాడు.స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో మాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు గండెలవిసేలా రోధించారు. దీంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకొన్నాయి.