నగరంలోని చాదర్‌ఘాట్ రోడ్డుపై కొండచిలువ కలకలం రేపింది. చాదర్ ఘాట్ సాయిబాబా దేవాలయం సమీపంలో కొండచిలువ కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొండ చిలువను రోడ్డుపై చూసిన స్థానికులు వెంటనే చాదర్‌ఘాట్ పోలీసులకు ఈ మేరకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపేశారు. మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ అక్కడకు చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు. దానిని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచిలువ ఎక్కడి నుంచో రోడ్డు మీదకు వచ్చి ఉంటుందని అంటున్నారు. కొండ చిలువ రోడ్డుపైకి రావడంతో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించింది.