ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విద్యుత్ ప్లాంట్‌లో లిఫ్ట్ కూలి నలుగరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు కార్మికులకు గాయాలయ్యాయి. శక్తి జిల్లాలోని ఓ విద్యుత్‌ప్లాంట్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికులు పని ముగించుకొని లిఫ్ట్‌లో కిందకి వస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్‌లో 10 మంది ఉన్నారు. అందులో నలుగురు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.