మేషం – జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి.
వృషభం – నూతన వ్యాపారాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పలుకుబడి నామమాత్రంగా పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
మిథునం – సంఘంలో గౌరవానికి లోటుండదు. కుటుంబ కలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉన్నాయి.సహోదరి వర్గానికి సహాయ పడవలసి వస్తుంది.ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం
కర్కాటకం – ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకునే విషయమై సందిగ్ధత లభించదు.
సింహం – ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు గుర్తించడం కష్టతరంగా పరిణమిస్తుంది. మనసుకు తోచింది చేసుకుంటూ పోవడమే తప్ప క్రమశిక్షణ కరువవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు.
కన్య – పొదుపు పైన దృష్టిని సారించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల కాలం.
తుల – నూతన ఒప్పందాలు అనివార్య కారణాల వలన వాయిదా పడతాయి. ఇందువలన సమయ నష్టమే తప్ప ఆర్థిక నష్టం ఏర్పడదు. స్థాన మార్పులు ఉండవచ్చు.
వృశ్చికం – కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్రేయోభిలాషులతో సలహాలు సంప్రదింపులు జరుపుతారు. ఒక మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి విరాళాలను సేకరిస్తారు.
ధనుస్సు – పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలున్నాయి. సన్నిహితులు నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయకండి.
మకరం – సంతానంలో ఏర్పడుతున్న మొండితనాన్ని నివారించడానికి గాను కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొంతమంది ప్రబుద్ధులు స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీతో స్నేహ హస్తం కలుపుతారు.
కుంభం – ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంగీత, సాహిత్య కళారంగాలలో ప్రత్యేక అభిరుచిని కలబరుస్తారు. చిన్ననాటి మిత్రులు దగ్గరవుతారు. మానసిక ఆనందం కలుగుతుంది.
మీనం – వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ స్థాయి పెరుగుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గృహోపకరణాలు. శుభకార్యాలు మొదలగు వాటికి అధికంగా ధనం ఖర్చు చేస్తారు.