దేశం కోసం భారీ డీల్‌ని ఆసీస్ క్రికెటర్లు ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్‌లు తిరస్కరించారట. ప్రస్తుతం సోషల్‌మీడియాను ఈ వార్త కుదిపేస్తోంది. ఐపిఎల్‌కి చెందిన ఓ ఫ్రాంచైజీ కమ్మిన్స్, హెడ్‌లకు చెరో రూ.58 కోట్లు (10 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు) ఇస్తానని ఆఫర్ చేసిందట. అందుకోసం ఓ షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును తీసుకోవాలంటే.. ఆస్ట్రేలియా జట్టు నుంచి బయటకు రావాలని.. కేవలం ఐపిఎల్‌లో మాత్రమే కాకుండా.. తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరఫున ఇతర లీగ్‌లలో కూడా ఆడాలని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఆఫర్‌ని వాళ్లిద్దరూ తిరస్కరించారని.. డబ్బు కంటే దేశమే ముఖ్యమని చెప్పారని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఐపిఎల్‌లో ఆడుతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కమ్మిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.18 కోట్లకు, హెడ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ కింద కమ్మిన్స్‌కి రూ.8.74 కోట్లు, హెడ్‌కి రూ.8.70 కోట్లు వస్తాయి. ఇతర లీగ్‌లలో ఆడినప్పటికీ.. ఇంత మొత్తం రాదు. మొత్తానికి కమ్మిన్స్ ఏడాదికి రూ.35 నుంచి 40 కోట్లు, హెడ్ రూ.25 నుంచి 30 కోట్లు సంపాదిస్తారు. ఒక రకంగా చూసుకుంటే సదరు ఫ్రాంచైజీ ఇచ్చి ఆఫర్ కమ్మిన్స్ కంటే హెడ్‌కే ఎక్కువ లాభం. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.