హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. సిటిలోని కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, చాదర్ ఘట్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్, విద్యానగర్, తార్నాక, సికింద్రబాద్, బేగంపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ తోపాటు సాగర్ రోడ్, చంద్రాయన్ గుట్ట ప్రాంతాల్లోనూ వాన కురిసింది. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది.