గుంటూరు: తన సోదరిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని ఓ యువకుడిని యువతి సోదరుడు దారుణంగా హత్య చేశాడు. గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కుర్రా గణేశ్ అనే యువకుడిని యువతి సోదరుడితో పాటు మరో ఇద్దరు కలిసి దారుణంగా హతమార్చారు. కొలకలూరుకు చెందిన యువతిని.. విద్యుత్‌శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్న గణేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ కోరుతూ గుంటూరు నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడారు. దీంతో అంతా సద్దుమణిగిందని భావించారు. ఈ తరుణంలో గణేశ్‌ని యువతి సోదరుడు దారుణంగా కత్తులతో పొడిచి చంపారని గణేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.