వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు చోటు దక్కడం అనుకున్నంత సులువేం కాదని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఎబి డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇప్పటికే కోహ్లి, రోహిత్‌లు టెస్టులు, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించారని, ఇలాంటి స్థితిలో ఫిట్‌నెస్ ప్రమాణాలతో పాటు ఫామ్‌ను కాపాడుకోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. బిసిసిఐ అన్ని ఆలోచించే యువ ఆటగాడు గిల్‌ను వన్డే సారథిగా ఎంపిక చేసిందన్నాడు. ఇక కోహ్లి, రోహిత్‌లతో పోల్చితే వరల్డ్‌కప్‌లో కుర్రాళ్లను ఆడించేందుకే బిసిసిఐ ఆసక్తి చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఈ పరిస్థితుల్లో వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లిలు ఆడడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.