లండన్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జ రిగే మ్యాచ్‌లు సాఫీగా సాగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)ని డిమాండ్ చేశాడు. ఇటీవల ఆసియాకప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య చెలరేగిన ఘటనలపై అథర్టన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఐసిసి పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నాడు. ఇప్పటికైనా ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచుల్లో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా ఆవి సాఫీగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించాడు.
పాక్, భారత్ ఆటగాళ్లు వ్యవహరిస్తున్న తీరుతో క్రికెట్ ప్రమాణాలు పడిపోతున్నాయని అథర్టన్ ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో ఇరు దేశాల మధ్య ఇంతకంటే ఉద్రిక్త వాతావరణం ఉండేదని, అయితే మ్యాచ్‌లు మాత్రం ఎలాంటి ఘటనలు లేకుండా సాఫీ గా సాగేవన్నారు. ఇటు పాక్ అటు భారత ఆటగాళ్లు సంయమనంతో ముందుకు సాగేవారన్నాడు. కానీ ఇటీవల కాలంలో ఇరు జట్ల ఆటగాళ్లు సంయమనం కొరవడిందని, దీనికి ఆసియాకప్ టోర్నీలో నెలకొన్న పరిస్థితులే నిదర్శమని అథర్టన్ పేర్కొన్నాడు.