ఆస్ట్రేలియాతో టీం ఇండియా త్వరలో తలపడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టి-20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో తలపడే భారత జట్టును ఇప్పటికే బిసిసిఐ ప్రకటించింది. వన్డేలకు శుభ్‌మాన్ గిల్, టి-20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆస్ట్రేలియా తమ వన్డే, టి-20 జట్టును ప్రకటించింది. ఈ రెండు ఫార్మాట్‌లలో ఆసీస్‌కు మిచ్ మార్ష్ కెప్టెన్సీ చేయనున్నాడు. దీంతో పాటు పలువురు స్టార్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇచ్చారు.
ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌కి గాయం కారణంగా దూరమైన మిచెల్ స్టార్క్ ఈ సిరీస్‌తో బరిలోకి దిగుతున్నాడు. అతడితో పాటు గాయాల నుంచి కోలుకున్న మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్ రీఎంట్రీ ఇచ్చారు. 2022 తర్వాత ఓపెనింగ్ బ్యాటర్ మ్యాట్ రెన్‌షాకు ఈ సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దొరికింది. వన్డే సిరీస్‌తో పాటు టి-20 సిరీస్‌కి కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఇందులో గాయాల నుంచి కోలుకున్న ఇంగ్లిస్, ఎల్లిస్ జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడిన మ్యాక్‌వెల్ ఈ సిరీస్‌కి దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, అడమ్ జాంపా.
ఆస్ట్రేలియా టి-20 జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపా
ఇక ఈ పర్యటనలో ఆక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్.. 29వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.