మెల్‌బోర్న్: భారత్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ వన్డే జట్టులోకి వచ్చాడు. రెండు ఫార్మాట్‌లలోనూ మిఛెల్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మరో ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 19న పెర్త్‌లో జరిగే వన్డేతో సిరీస్‌కు తెరలేస్తోంది.
కాగా, భారత్‌తో జరిగే వన్డేల కోసం 15 మందితో కూడిన ఆస్ట్రేలియా టీమ్‌ను సెలెక్టర్లు ప్రకటించారు. ప్యాట్ కమిన్స్ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో మార్ష్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మరోవైపు ఫాస్ట్ బౌలర్లు మాథ్యూ షార్ట్, మిఛెల్ ఓవెన్‌లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల కోసం టి20 టీమ్‌ను కూడా ప్రకటించారు. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్, ఓవెన్, షార్ట్‌లు ఈ సిరీస్‌లోనూ చోటు సంపాదించారు.
వన్డే జట్టు వివరాలు:
మిఛెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారే, కూపర్ కొనొలి, బెన్ డ్వార్‌షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోస్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిఛెల్ స్టార్క్, ఆడమ్ జంపా, మిఛెల్ ఓవెన్.