కరాచీ : పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్-పాక్‌ల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థల ముందు పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు విఫలమయ్యాయి. అయితే నిజం ఒప్పుకునేందుకు ఇష్టపడని పాక్ … కొత్త వాదనకు తెర లేపింది. భారత్‌తో జరిగిన ఘర్షణల్లో తాము ఉపయోగించిన చైనా ఆయుధాలు బాగా పనిచేశాయని పేర్కొంది. ఆ దేశ ఐఎస్‌పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో జరిగిన ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ ఇటీవల అనూహ్యంగా చైనా ఆయుధాలు బాగా పనిచేశాయన్నారు. భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. తమది ఒక్కటి కూడా కోల్పోలేదంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తాము సాంకేతికమైన ఆయుధాలను కలిగి ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఉపయోగించిన చైనా ఆయుధాలు పేలవమైన ప్రదర్శనలు చూపించాయని ఇటీవల భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ పేర్కొన్నారు. అమెరికా తయారు చేసిన ఎఫ్16 , చైనా జేఎఫ్ 17 సహా 1213 పాక్ యుద్ధ విమానాలను కూల్చేశామని వెల్లడించారు. భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న వాదనలు కట్టుకథలుగా కొట్టిపడేశారు. స్వదేశంలో పరువు కాపాడుకునేందుకు పాక్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు.