ప్రయాణీకులకు శుభవార్త
ఆలస్యమైనా..ఆందోళన వద్దు.. హైదరాబాద్ మెట్రో
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త చెప్పింది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో మీతోనే ఉంది. రాత్రివేళ సమావేశాలు, ఆఫీస్ పనులతో ఆలస్యమైనా ఇక ఆందోళన అవసరం లేదు. అంటూ మంగళవారం ఎక్స్ వేదికగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఆసక్తికర ట్వీట్ చేసింది. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 11:45 గంటల వరకు చివరి రైలు నడవనుందని స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికులు ఇక తొందరపడకుండా సురక్షితంగా, సౌకర్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపింది. రాత్రి వేళల్లో కూడా ప్రయాణికుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్వీట్‌లో పేర్కొంది.