న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమిండియా అదే జోరుతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టులో భారత్‌కు విండీస్ ఏ మాత్రం పోటీనివ్వలేక పోయింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన గిల్‌సేన రెండో టెస్టుకు అదే వ్యూహంతో బరిలోకి దిగనుంది.
ఢిల్లీ వేదికగా జరగనున్న చివరి టెస్టులోనూ విజయ ఢంకా మోగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకుటోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా విశ్రాంతినివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో ప్రసిధ్ కృష్ణకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని వన్డే సిరీస్‌కు ఎంపికైన ప్రసిధ్‌కు గేమ్ టైమ్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ సిరాజ్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే బుమ్రా జట్టులో కొనసాగుతాడు. విండీస్‌తో తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు పడగొట్టలేకపోయాడు. మరోవైపు అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది.
ఈ క్రమంలోనే టీమిండియా అదనంగా స్పిన్ ఆల్రౌండర్‌తో బరిలోకిదిగనుంది. పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దింపే అవకాశం ఉంది. తొలి టెస్టులో నితీష్ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ దక్కలేదు. అయితే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్‌ను తప్పించి దేవదత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశంఉంది. అయితే ఒకే ఇన్నింగ్స్ వైఫల్యానికి సాయి సుదర్శన్‌ను పక్కనపెడుతారా? అనే అనుమానం లేకపోలేదు. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉండక పోవచ్చు.
రెండో టెస్టుకు భారత జట్టు అంచనా..
యశస్వి జైస్వల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.