అమరావతి: కల్తీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కల్తీ మద్యం తయారుచేసే దొంగల ముఠాను పట్టుకుంది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ మద్యం గుట్టు తాము విప్పితే.. మాజీ సిఎం వైసిపి జగనే మోహన్ రెడ్డి కనిపెట్టినట్లు సంబరాల? అని ప్రశ్నించారు. జగన్ హయాంలోనే మద్యం స్కామ్ ను తప్పుదారి పట్టించేందుకే కొత్త నాటకాలు అని గత ఐదేళ్లు కల్తీ మద్యం వల్ల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని బాధను వ్యక్తం చేశారు. కల్తీ సారా మృతులపై గతంలో వైసిపి నాయకులు హేళన చేసి మాట్లాడారని, నేడు కల్తీ మద్యంపై నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.