ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సా పించిన బి.వి. వర్క్ సమర్పణ లో సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కళ్యా ణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న చిత్రం ’మిత్ర మండలి’. ఈ వినోదభరిత చి త్రానికి నూతన దర్శకుడు విజయేంద ర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నా రు. వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చడానికి, దీపావళి కానుకగా అక్టోబర్ 16న ’మిత్ర మండలి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ట్రైలర్ వచ్చింది.
హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ’మిత్ర మండలి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. లిటిల్ హార్ట్ చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొని, ట్రైలర్ ఆవిష్కరణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విచిత్రమైన పాత్రలు, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ఈ ట్రైలర్ అందరినీ అలరిస్తోంది. ’మిత్ర మండలి’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. “థియేటర్ కి వ చ్చిన ప్రేక్షకులు సంతోషంగా నవ్వుకొని బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ’మిత్ర మండలి’ సినిమా చేశా ము. జాతిరత్నాలకు రెట్టింపు నవ్వులు పంచి, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాము. నలుగురు స్నేహితులు కూర్చొని, సరదాగా మాట్లాడుకుంటే ఎలాంటి ఆనందం కలుగుతుందో.. అలాంటి ఆనందాన్ని ఈ సినిమా కలిగిస్తుంది” అని అన్నారు.
చిత్ర కథానాయిక నిహారిక ఎన్‌ఎమ్ మాట్లాడుతూ.. “మిత్ర మండలి కథ వినగానే.. ఈ కథ నాకు సరిగ్గా సరిపోతుంది, ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. నా పాత్రకు చాలా ప్రాధాన్యముంటుంది. మొదటి సినిమాలోనే ఇంత మంచి పాత్ర రావడం సంతోషంగా ఉంది”అని తెలిపారు. చిత్ర సమర్పకులు బన్నీ వాస్ మాట్లాడుతూ “మిత్ర మండలి చాలా మంచి కథ. నాకు బాగా నచ్చిన కథ. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య హాసన్, మౌళి, సాయి మార్తాండ్, సింజిత్ యర్రమిల్లి, జయకృష్ణ పాల్గొన్నారు.