యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా టాకీ పార్ట్ 80 శాతం పూర్తయింది. ఇక ఒక షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. తాజాగా ఆ షెడ్యూల్‌ను కూడా టీమ్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో అఖిల్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్‌ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్ పది రోజుల పాటు సాగుతుందని, ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా వేశారని సమాచారం. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్, – శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. ఈ చిత్రంలో అఖిల్ రగ్డ్ లుక్‌లో కనిపించనున్నాడు. చిత్తూరు యాసలో డబ్బింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.