హైదరాబాద్: మాదిగలు అంటే అంత చిన్న చూపా? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. తాను మాదికను కాబట్టే మంత్రి పదవి వచ్చిందని అన్నారు. అన్న మాటను సమర్ధించుకొని ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నావు అంటే ఈ విషయం తన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. మంత్రి పొన్నం పై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరపాటును ఒప్పుకుని క్షమాపణ చెబితే పొన్నం కు గౌరవం ఉంటుందని, పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం తనకు రాదని తెలియజేశారు. పొన్నం తన తప్పును తెలుసుకుంటారని అనుకున్నానని అన్నారు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యత అని హెచ్చరించారు. వివేక్ వెంకటస్వామి లాగా తన దగ్గర డబ్బులు లేవని తాను మంత్రి కావడం, తాను సామాజిక వర్గంలో పుట్టడం తన తప్పా? అని అడ్లూరి నిలదీశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ ను కలుస్తానని, తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారని అన్నారు. తాను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.