మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు రేగాయి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరా టాన్ని విరమించాలని క్యాడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన 22 పేజీల లేఖ ఇప్పు డు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని అనివార్య కార ణాల వల్ల, ఈ పదవిలో కొనసాగే అర్హత తనకు లేదని భావించి పార్టీని వీడుతున్నట్లు ఆ యన స్పష్టం చేశారు. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను ఉద్దేశిం చి ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘ఆయుధాలు వదిలేస్తాంఅంటూ కొద్దిరోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఓ ప్రకటన విడుదల చేశా రు.
అభయ్ తన వద్ద గల ఆయుధా లను అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వా ధీనం చేసుకుంటుందుని పార్టీ ప్రకటన జారీ చేసిం ది. క్యాడర్‌కు లేఖ రాసిన మావో యిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల ఈ అంశంపై వివరణ ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు మల్లోజుల కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్న ప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ లేఖలో వెల్లడించారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయా మంటూ క్షమాపణలు చెప్పారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయి స్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంధా పూర్తిగా తప్పిదమే అని అంగీకరించారు. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మావోల లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్‌కు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల పిలుపునిచ్చారు.
మల్లోజుల లొంగిపోయే ఛాన్స్…!?
మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి తమ్ముడు. వేణుగోపాల్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు. ఆ తర్వాత వేణుగోపాల్ భా ర్య తారా లొంగిపోయా రు. కిషన్ జీ భార్య మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే పోలీసులకు లొంగిపోయారు. అటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవ రావు (ఆశన్న) కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తున్నారని ఊహా గానాలు జోరు గా వినిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి 31లోపు తుదముట్టిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు. ఈ మేర కు బలగాలు మావోయిస్టులను వెంటాడుతున్నా యి. ఈ క్రమంలో చాలా మంది పెద్ద స్థాయి నక్సలైట్లు ఎన్ కౌంటర్‌లో చనిపో తున్నారు. కొంత మంది లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మల్లోజుల కూ డా లొంగిపోయే అవకాశా లు కనిపిస్తున్నాయి.