రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ అప్పజెప్పడం శుభపరిణామమని పేర్కొన్న ఆయన రోహిత్, కోహ్లీలు రానున్న మరికొన్ని రోజుల్లో మరిన్ని చేదు వార్తలు వినడం తప్పదన్నాడు. వారు 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనుకుంటే అందుకు సన్నద్ధత అవసరం. రాబోయే రెండేళ్లలో అందుకు తగినన్ని వన్డేలు లేవు. ఏడాదికి ఆరేడు మాత్రమే ఉన్నాయి. దీంతో వారికి సరైన ప్రాక్టీస్ దొరకదు. దీంతో రోహిత్, విరాట్‌లు అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా దేశవాళీలోనూ ఆడాల్సి ఉంటుంది. లేకపోతే వారి అభిమానులు మరిన్ని చేదు వార్తలు వినాల్సి వస్తోంది. వచ్చే వరల్డ్ కప్‌కు ఆడాలనుకుంటే ఇద్దరూ దేశవాళీలో ఆడి, స్పష్టమైన ఫిట్‌నెస్ సాధించాలి’ అని పేర్కొన్నాడు.