పెట్రోల్ బంక్‌లోకి వచ్చిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం తప్పిన సంఘటన నగరంలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంప్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకు కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కారును హిందూస్థాన్ పెట్రోల్ పంప్‌లో నిలిపిన సమయంలో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది కారును అక్కడి నుంచి రోడ్డుపైకి నెట్టుకుంటూ వెళ్లారు. తర్వాత అగ్నిమాక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను ఆర్పి వేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తం కావడంతో కారులో ఉన్న ఇద్దరి ప్రాణాలు నిలిచాయి. దీంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు, పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తంగా ఉంకుంటే ఇద్దరు ప్రాణాలు పోయేవని, కారులో మంటలు పెట్రోల్ బంక్‌కు అంటుకుంటే భారీగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.