లక్నో: ఇద్దరు అక్కాచెల్లెళ్లు భర్తలను మార్చుకున్నారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాలి పోలీస్ స్టేషన్‌లో ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాడు. ఇద్దరు కూతుళ్లు తమ భర్తలు, పిల్లలతో సుఖంగా జీవిస్తున్నారు. ఆరు నెలల క్రితం అక్క భర్తతో చిన్నా కూతురు ప్రేమలో పడింది. ఇద్దరు మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరు కలిసి పారిపోయారు. వారి కోసం అక్క, చిన్నఅల్లుడు, తండ్రి వెతికారు. ఎక్కడా వారు కనిపించలేదు. చిన్న అల్లుడు వదినను పెళ్లి చేసుకున్నాడు. చిన్న కూతురు, బావ, పెద్ద కూతురు, మరిది అందరూ అత్తారింటికి వచ్చారు. అక్కా చెల్లెలు తమ భర్తలను మార్చుకోవడానికి ఒప్పుకున్నారు. అక్క పిల్లలను చెల్లెలికి, చెల్లెలు పిల్లలను అక్కకు ఇచ్చారు. గ్రామంలో కుటుంబం పరువు పోవడంతో తండ్రి అందరిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఇద్దరు కూతుళ్లతో బంధాలను తెంచుకున్నామని వెల్లడించాడు.