అమరావతి: కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసు అంటూ వైఎస్ఆర్ సిపిపై దుష్ప్రచారం చేశారని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నకిలి మద్యాన్ని కుటీర పరిశ్రమలా మార్చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి నేతల పోరాటం వల్లే కల్తి మద్యం బయటపడిందని, కూటమి పాలనలో మద్యం షాపులు బార్ లా మారిపోయాయని భూమన విమర్శించారు. నకిలీ మద్యాన్ని పల్లెపల్లెకు పంపారని, కూటమి పాలనలో కల్తి మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి, జనసేన నేతల కల్తి మద్యం దందా నడుస్తోందని, ఎపిలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తి మద్యమే అని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.