అమరావతి: పెనుకొండ నియోజకవర్గంలో మహిళా పోలీస్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో షఫీ, మైనుద్ధీన్ అనే క్యాబ్ డ్రైవర్లు తనను వేధిస్తున్నారని కూల్ డ్రింక్ లో మహిళా హోంగార్డు ప్రియాంక పురుగుల మందు కలుపుకుని తాగింది. సిఐ దగ్గరకి పోయి తనమీద ఆరోపణలు మోపుతున్నారని పేర్కొంది. గోరంట్ల సిఐ శేఖర్ కూడా వారి మాటలు నమ్మి వాళ్ళకే వత్తాసు పలికి తనని క్వార్టర్స్ ఖాళీ చేయమన్నాడని మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేసింది. రహస్య ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసుకుని మహిళా హోంగార్డు ఆత్మహత్యయత్నం చేసింది. మహిళా హోంగార్డు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. టిడిపి మంత్రి సవిత నియోజకవర్గం పెనుకొండ కావడం గమనార్హం.
