జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సవాయ్ మాన్‌సింగ్ ట్రామా సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆరుగురు రోగులు దుర్మరణం చెందారు. ఒక్కసారిగా ఆస్పత్రిలో పొగలు అలుముకోవడంతో రోగులు, సిబ్బంది హాహాకారాలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. ఈ ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన 14 మంది వేరే ఆస్పత్రికి తరలించారు. ఐసియులో 11 మంది రోగులు చికిత్స తీసుకుంటుండగా మంటలు చెలరేగాయని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. షార్ట్ సర్కూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.