అమరావతి: అంబేడ్కర్ విగ్రహం తగలబెట్టారని ఫిర్యాదు ఇచ్చిన మా నాన్ననే అరెస్ట్ చేశారని దేవళంపేట దళిత సర్పంచ్ గోవిందయ్య కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘జరిగిన విషయం ఏంటీ?… పోలీసులు మా నాన్న మీద పెట్టిన కేసు ఏంటీ?.. ఇది మీకు న్యాయమా?’ అని ప్రశ్నించారు. టిడిపి నేత సతీష్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అతడు ప్రశ్నించాడు. మా నాన్న లాకప్ డెత్ అయితే పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు. దేవళంపేట ప్రధాన కూడలిలో మూడు రోజుల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, దళితులు డిమాండ్ చేశారు. టిడిపి నేత సతీష్ నాయుడు, అతని అనుచరులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని దళిత సర్పంచ్ చొక్కా గోవిందయ్య ఆరోపణలు చేసిన విషయం విధితమే.
–