రంగారెడ్డి: భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నగరంలోని పలుచోట్ల వాన పడుతోంది. లక్డీకపూల్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సనత్ నగర్, బేగంపేట్, సికింద్రాబాద్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఆబిడ్స్, కోఠి, తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. జిహెచ్‌ఎంసి, డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించింది. అక్కడక్కడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.