చెన్నై: తమిళనాడులోని చెన్నై సముద్ర తీర ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతుండగా పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు, కెమెరాలు నీటిలో మునిగిపోయాయి. ఇద్దరు వ్యక్తులను సినిమా సిబ్బంది రక్షించారు. ‘మండాడి’ సినిమా షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కెమెరాలు, ఇతర సామాగ్రి సముద్రంలో కొట్టుకపోయాయి. ఈ చిత్రాన్ని మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాల్లో సుహాస్, సూరి మెయిన్ రోల్లో నటిస్తున్నారు.