కొలంబో: ఐసిసి విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో భార త్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు తేజం క్రా ంతి గౌడ్ 3/20, దీప్తి శర్మ 3/45లు బాల్‌తో రా ణించడంతో భారత్ 88 పరుగులతో ఘన విజ యం సాధించింది. పాకిస్థాన్ బ్యాటర్లలో సిడ్రా అ మిన్(81) నటాలియా పెర్వైజ్(33), సిడ్రా నవాజ్(14)లు తప్ప మరెవరూ రాణించలేక పోయా రు. విగతావరంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో పాక్ ఘోర ఓటమిని మూటగట్లుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు టాస్ ఓడి బ్యా టింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్ (46) రాణించగా.. జెమీ మా రోడ్రిగ్స్ (32), దీప్తిశర్మ(25)లు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. జట్టు స్కోర్ 230 దాటడమే కష్టమనుకున్న దశలో రీచా ఘోష్(35 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడింది. కానీ, చివరిఓవర్లో రెండు వికెట్లు పడడంతో భారత్ 247 పరుగులకు ఆలౌటయ్యింది. ఇక ఈ మ్యా చ్‌లో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(23) కాసేపు అలరించినా పవర్ ప్లేలోనే వెనుదిరిగింది.