మన తెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాల నుంచి కొలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రాంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మంగళవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.