దుబాయ్: విండీస్ తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినా టీమిండియా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భారత్‌కు ఇదిమూడోవిజయం. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో 12 పాయింట్స్ చేరాయి. డబ్ల్యూటిసి 2027 పాయింట్స్ పట్టికలో భారత్ విజయాల శాతం 46.67 నుంచి 55.56 శాతానికి పెరిగింది. అయితే ర్యాంకింగ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటిసి ర్యాంకింగ్స్‌ను పాయింట్ల ద్వారా కాకుండా విజయాల శాతం ఆధారంగా లెక్కిస్తారు. ఈ సైకిల్ ముగిసే సమయానికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి. ప్రస్తుతం ఆలిస్ట్రేయా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచింది. దాంతో 100 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది కంగారూల టీమ్.