మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎంఎల్‌ఎ టి రాజా సింగ్‌పై శాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారు. గోషామహల్ ఎంఎల్‌ఎ ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారాయి. కొంతమంది స్థానికులు శనివారం శాలిబండ పోలీసులను సంప్రదించి రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎంఎల్‌ఎపై బిఎన్‌ఎస్ చట్టం, ఐటి చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.