కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్‌లో భారీ వర్షాలు కురవడంతో మట్టి పెళ్లలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. మిరిక్‌లోని జస్బీర్ బస్తీలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. బాలసోన్ నది ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో ఇనుప వంతెన కూలిపోయింది. ఈ ఇనుప వంతెన పైనుంచి సిలుగుడి నుంచి మరిక్‌ను ప్రజలు ప్రయాణించేవారు. వంతెన కూలి పోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కలింపాంగ్‌లో భారీ వర్షాలు కువడంతో వరద బీభత్సం సృష్టిస్తోంది. 717 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో మార్గం మూసివేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.