మన తెలంగాణఱ/హైదరాబాద్ : కన్న కొడుకే కాలయముడై తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ కిరాతక ఘటన ఎపిలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసు కుంది. తల్లి మందలించిందన్న ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి కత్తితో గొంతు కోసి హతమార్చాడు. పట్టణం లోని శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కథనం ప్రకారం శ్రీరామ్‌నగర్‌కు చెందిన యశ్వంత్ రెడ్డికి, అతడి తల్లి లక్ష్మీదేవికి మధ్య ఇంట్లో వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన యశ్వంత్ వంట గదిలో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేసి ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా, రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి పడేశాడు.
ఈ ఘాతుకానికి పాల్పడే సమయంలో తన తండ్రిని మరో గదిలో బంధించడం గమనార్హం. ఉప్పలపాటి లక్ష్మీదేవి ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్‌లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. భర్త విజయభాస్కర్ రెడ్డి బ్రాందీ షాపులో పని చేసేవాడు. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నాడు. వీరికి యస్వంత్ కుమార్ రెడ్డి ఒక్కడే సంతానం. మూడు సంవత్సరాల క్రితం బీటెక్ పూర్తి చేసి సినిమాలలో నటించాలనే కోరికతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కొంత కాలంగా యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని హైదరాబాద్ లోని ప్రయివేటు డాక్టరు వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తర లించారు. నిందితుడు యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమా నిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివిన కొడుకే తల్లి పాలిట యముడిగా మారడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నా యి. యశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సినిమాలలో నటించాలనే కోరిక బలంగా ఉండటంతో తల్లిని తరుచూ డబ్బులు ఇవ్వమని వేధించేవాడని, ఈ క్రమంలోనే తల్లి యశ్వంత్‌ను మందలించేదని కుటుంబ సభ్యులు అంటు న్నారు. కన్నతల్లి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికుంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.