హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ’మీసాల పిల్ల’ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడు అనిల్ రవిపూడి, లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ నవ్వులు పంచారు. అలాగే ఉదిత్ నారాయణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లని పరిచయం చేశారు. భీమ్స్ ఇచ్చిన సంగీతం, ఉదిత్ నారాయణన్ గాత్రం, చిరంజీవి తన మార్క్ గ్రేస్‌తో వేసిన స్టెప్పులతో ఈ పాట ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఇదిలాఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిద్దరు కలిసి చెన్నైలో జరిగే 80s రీయూనియన్ కోసం విమానంలో ప్రయాణించారు. చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై బయలుదేరే ముందు వారిద్దరు కలిసి ఓ ఫొటోకు పోజిచ్చారు. ఈ స్టార్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఈ ఫోటోతో వారి మధ్య మంచి స్నేహం మరోసారి బయటపడింది. ఇక చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.