మన తెలంగాణ/ఎల్‌బినగర్: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థ్ది మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఎల్‌బినగర్ నియోజకవర్గం, బి ఎన్‌రెడ్డినగర్ డివిజన్ పరిధిలో గల టీచర్స్ కాలనీ ఫేజ్ 2లో నివాసం ఉండే పోలే జగన్మోహన్ సునీతా దంపతులకు మూడో సంతానం చంద్రశేఖర్ (28) 2023లో బిడిఎస్ పూర్తి చే సి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. శ నివారం తెల్లవారుజామున డల్ల్లాస్‌లో ఒక దుండగుడు జరిపిన దాడుల్లో చంద్రశేఖర్ మృ తి చెందాడు. కాగా,పోలే చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా సిఎం స్పందించారు. అమెరికాలో దుండగుల కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని సిఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకరిస్తామని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చంద్రశేఖర్ దుర్మరణం పట్ల మంత్రి అడ్లూరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉన్న ఒక తెలుగు విద్యార్థి ఇంత దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమని అన్నారు. మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన ఓ ప్రతిభావంతుడు ఇంత చిన్న వయసులో ఇలా మృత్యువాత పడటం మనందరికీ బాధాకరమని అడ్లూరి అన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి , సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీర్ హరీశ్ రావు, స్థానిక ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు రప్పిస్తామని తెలిపారు. తమ కుమారుడు లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కుపోతోందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.